కాసేపట్లో ప్రియాంక రెడ్డి ఇంటికి గవర్నర్ తమిళిసై

  • ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించనున్న గవర్నర్
  • మధ్యాహ్నం 3 గంటలకు ప్రియాంక ఇంటికి వెళ్లనున్న తమిళిసై
  • కాసేపట్లో మహిళా కమిషన్ సభ్యులు కూడా ప్రియాంక ఇంటికి
వైద్యురాలు ప్రియాంక రెడ్డిపై నలుగురు దుండగులు దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వారి ఇంటికి వెళ్లనున్నారు. మరోవైపు, ప్రియాంక కేసును సుమోటాగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కూడా కాసేపట్లో ఆమె ఇంటికి వెళ్లనున్నారు.

కాగా, ప్రియాంక రెడ్డి హత్య నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో ర్యాలీలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ లోని మహిళా డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కొనసాగుతోంది. మరిన్ని జిల్లాల్లోనూ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. నిందితులను ఉరి తీయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Telangana
Crime News
Hyderabad

More Telugu News